బంగారం…లేటెస్ట్ రేట్లు ఇలా!

504
gold rate
- Advertisement -

బంగారం ధర పరుగులు పెడుతూనే ఉంది. వరుసగా మూడోరోజు పెరిగిన బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.39,810 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.43,430కు చేరుకుంది. ఈ మూడు రోజుల్లో ధర ఏకంగా రూ.790 పెరగడం గమనార్హం.

బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.49,900 వద్దనే నిలకడగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ సహా పలు అంతర్జాతీయ సానుకూల పరిస్థితులు పసిడి పెరుగుదలకు కారణంకాగా ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఆందోళనలు రేకేత్తుతున్నాయి.

- Advertisement -