పల్లె ప్రగతి స్పూర్తితో పట్టణప్రగతి: ఎర్రబెల్లి

440
minister errabelli
- Advertisement -

గ్రామాల అభివృద్దితో గాంధీజీ కలలను నిజం చేయబోతున్న మహాత్ముడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పల్లెప్రగతి సమ్మేళనం మరియు పట్టణ ప్రగతిపై అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…హరిత గ్రామాలు, హరిత పట్టణాలుగా చూడాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. సమగ్రాభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని… గ్రామాల అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. రెండు విడతలుగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో.. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు.. గ్రామాలన్నీ 80 శాతానికి పైగా అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు.

గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ది పట్ల నిర్లక్ష్యం చేశాయని.. నేడు తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇస్తుంది.. విధుల పట్ల అంకితభావంతో పని చేయండన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలకు ప్రతినెల 339 కోట్లు విడుదల చేస్తూ.. గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు. పల్లె ప్రగతి స్పూర్తితో.. పట్టణప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని.. రాజకీయాలకు అతీతంగా.. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.

గ్రామ నర్సరీల ఏర్పాటు, స్మశానవాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణం, ట్రాక్టర్ల కొనుగోలు చేయాల్సిందేనని.. పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. పదవులకు కత్తెర పడుతుందన్నారు. హరితహారం మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి భాద్యతని… భూపాలపల్లి అటవీ అంతరించిపోయింది. చెట్టు నరికితే 5వేల నుంచి 5 లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష పడుతుందన్నారు.

స్మశానవాటికల నిర్మాణంలో భూపాలపల్లి జిల్లా వెనకబాటులో ఉందని… పదిరోజుల్లో నిర్మాణాలు పూర్తి చేయని.. సర్పంచ్ లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. ఉపాధి పథకం కూలీలను.. గ్రామాల్లో అభివృద్ధి, పారిశుద్ధ్యం పనులకు ఉపయోగించాలని…. అభివృద్ధి లో ముందంజలో ఉన్న మూడు గ్రామాలకు ప్రత్యేక నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంటరమణారెడ్డి, జె.యస్. భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిణి, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు, మున్సిపల్ చైర్మన్, జిల్లా కలెక్టర్, అధికారులు, సర్పంచ్ లు, ఎమ్పీటిసిలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సహకార సంఘాల చైర్మైన్ లు, డైరెక్టర్ లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -