ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వేటు..

462
umar akmal
- Advertisement -

పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్‌పై సస్పెన్షన్ వేటు వేసింది పాక్ క్రికెట్ బోర్డు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడకూడదంటూ పాక్ అవినీతి నిరోధక శాఖ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి పాకిస్ధాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుండగా ఉమర్‌పై సస్పెన్షన్ వేటు చర్చనీయాంశంగా మారింది.

పీఎస్‌ఎల్‌లో క్వెట్టా గ్లేడియేట‌ర్‌ జట్టుకు ఉమర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సస్పెన్షన్ నేపథ్యంలో ఉమర్ స్ధానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసుకోవచ్చని పీసీబీ తెలియ‌జేసింది. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున పీసీబీ దీనిపై ముందు ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదని పీసీబీ పేర్కొంది.

ఫిట్‌నెస్ టెస్ట్ సందర్భంగా ఉమర్ అక్మల్ దురుసుగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. లాహార్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ వద్ద జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో విఫలమైన అక్మల్… అక్కడి సిబ్బందితో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. గ‌త ఏడాది అక్మల్ ప్రాతినిధ్యం వహించిన గ్లాడియేట‌ర్స్ జ‌ట్టు విజేత‌గా నిలిచింది.

- Advertisement -