పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పడవ!

568
pawan kalyan
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అజ్నాతవాసి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నపవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు బోని కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈమూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాను చేస్తున్నాడు పవన్. ఈమూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది.

చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా కోసం ప్రత్యేక పడవని రూపొందిస్తున్నారట. పడవ సెట్ లో తాజా షెడ్యూల్‌ జరగనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన భూమికను తీసుకోబోతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన ఖుషి మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నారు పవన్. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

- Advertisement -