తెలంగాణ బడ్జెట్‌పై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం కానున్నది. పట్టణ ప్రగతితో పాటు సీఏఏ, ఎన్నార్సీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులో వివక్ష తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది.
ఆదాయవ్యయాలను పక్కాగా లెక్కిస్తున్నారు. అనవసర పద్దులకు పోకుండా అవసరమైన పనుల ప్రతిపాదనలను మాత్రమే ఆయా శాఖల నుంచి తెప్పించుకొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసినట్టుగానే భారీ అంచనాలకు పోకుండా వాస్తవిక అంచనాలతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ,పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తున్నది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశమున్నది.