ఆస్ట్రేలియా లో సీఎం కేసీఆర్ హరిత జన్మదిన వేడుకలు

392
Aus
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా లోని సిడ్నీ , అడిలైడ్ , మెల్బోర్న్ , కాన్బెర్రా , బ్రిస్బేన్ ,గోల్డ్ కోస్ట్ , బెండీగో, బల్లార్ట్ నగరాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. TRS ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అద్వర్యం లో సభ్యులందరు ఒక్కొక్క మొక్క నాటి హరిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు . రాజేష్ రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీ లో కెసిఆర్ దీర్గాయుష్యు కై ప్రత్యేక పూజలు ,అన్న దాన కార్యక్రమాలు చేసి , అభిమానుల మధ్య జన్మదిన వేడుకలు కోలాహలంగా నిర్వహించారు .

TRS ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపి ,ప్రాణ త్యాగానికి సైతం సిద్దపడి ,చావు అంచులకి వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ,అన్ని రంగాలలో రాష్ట్రాన్ని నేడు ప్రగతి పథం లో నడిపిస్తున్న కెసిఆర్ దీర్గాయుష్యు తో ,ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు.రవి యాదవ్ , శ్రీకాంత్ రెడ్డి ,సాయిరాం ఉప్పు,రవి సాయల అద్వర్యం లో అడిలైడ్ , బ్రిస్బేన్,మెల్బోర్న్, కాన్బెర్రా లో వేడుకలు నిర్వహించారు . రవీందర్ చింతామణి ,రవి శంకర్ ధూపాటి ,లక్ష్మణ్ నల్లాన్ ,పరశురామ్ ముతుకుల,సంగీత ధూపాటి ,జస్వంత్ కొడారపు,ప్రకాష్ హనుమంత ,వరుణ్ నల్లెల్ల ,సాంబ శివ రెడ్డి ,అజాజ్ మొహమ్మద్ , గుల్షన్ , స్మ్రితి రోహిత్ తదితరులు వేడుకలలో పాల్గొన్నారు .

- Advertisement -