- Advertisement -
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ని ఆదేశించారు సీఎం కేసీఆర్.
కొత్త రెవెన్యూ చట్టం, త్వరలో ప్రభుత్వం చేపట్టబోయే పట్టణ ప్రగతి కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరునున్నట్లు తెలుస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపై నిర్మితమవుతున్న తుపాకులగూడెం బ్యారేజీకి తెలంగాణ ఆదీవాసీ వీరవనిత, వనదేవత `సమ్మక్క` పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీనిని అమోదించనుంది కేబినెట్ అలాగే బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది.
- Advertisement -