మీకు తెలుసా.. రష్మికా కుక్క బిస్కెట్లు తింటుంది!

392
rashmika

యంగ్ హీరో నితిన్‌ -వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కిన చిత్రం భీష్మా. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా నితిన్, రష్మిక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ ఏడాదిలో తన పెళ్లి కాబోతోందని అన్నారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎప్పటి నుంచో తెలుసు. గత ఏడు ఎనిమిది ఏళ్లుగా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. కాబట్టి ఎన్నో వాలంటైన్స్ డేలు గడిచాయి అని చెప్పేశారు నితిన్. హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా నా క్రష్‌లే వందల్లో ఉన్నారని చెప్పారు. తనకు మాత్రం అంత సీన్‌ లేదని రష్మీకా చెప్పుకొచ్చింది. తమిళ స్టార్ దళపతి విజయ్ అంటే క్రష్ ఉండేదని చెప్పారు.

ఇక రష్మికాకు సంబంధించి టాప్ సీక్రెట్ చెప్పారు నితిన్‌. సాధారణంగా సాయంత్రం ఆకలేస్తే మీరు ఏం తింటారు? ఉప్మా, ఇడ్లీ, స్వీట్, డిజర్ట్, చిప్స్ ఏవో ఒకటి తింటారు. రష్మికా ఏం తింటుందో తెలుసా? కుక్క బిస్కెట్లు తింటుందన్నారు.దీనికి స్పందించిన రష్మికా తన దగ్గర ఒక పప్పీ ఉండేదని.. దానికి పెట్టే పెడిగ్రీ టేస్ట్ చేయాలనిపించి ఒకసారి తిని చూశానని అన్నారు.