హ్యాపిడేస్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్త బంగారులోకం సినిమాతో మరో హిట్ ను అందుకున్నారు. రెండు వరుస హిట్లతో వరుణ్ సందేశ్ క్రేజ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు. ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ చేసిన 20సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. దీంతో ఆయనకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో..తిరిగి అమెరికాకు వెళ్లిపోయారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత బిగ్ బాస్ 3 రూపంలో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు వరుణ్ సందేశ్. బిగ్ బాస్ షోలో 100రోజులు ఉండి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు.
తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు వరుణ్. నా సినిమాలు ప్లాప్ లో ఉన్నప్పుడు నా చుట్టుప్రక్కల ఉన్నవాళ్లు చాలా మంది వదిలేసి వెళ్లిపోయారు. కానీ నాకు ఇద్దరు వ్యక్తులు ధైర్యం ఇచ్చారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరో అల్లరి నరేష్ లు తనకు అండగా నిలిచినట్లు తెలిపారు. నా సినిమాలుప్లాప్ లో ఉన్నాయని తెలిసి కూడా దిల్ రాజు నాతో సినిమా చేసాడని గుర్తు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరు వ్యక్తులను తాను జీవితంలో మర్చిపోనని అన్నారు. బిగ్ బాస్ కు వెళ్లేముందు కూడా తాను దిల్ రాజును కలిసినట్లు వెల్లడించారు.