చైతు ‘లవ్ స్టోరీ’ నుండి ‘ఏయ్ పిల్లా’ సాంగ్‌..

544
- Advertisement -

హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘లవ్ స్టోరీ’.ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమ కథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమిత ఆసక్తిని కలిగించింది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Love Story

ఈ చిత్రం నుండి ‘ఏయ్ పిల్లా’ అనే అకట్టుకునే సాంగ్‌ను రిలీజ్‌ చేయబోతున్నారు చిత్ర బృందం. ఈ సాంగ్‌ను ఈ నెల 14వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నారు.’ఫిదా’ హిట్ తరువాత శేఖర్ కమ్ముల నుంచి రానున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు పెరుగుతున్నాయి.

‘ఫిదా’లో సాయి పల్లవి తెలంగాణ యాస మాట్లాడితే, ఈ సినిమాలో చైతూ తెలంగాణ యాస మాట్లాడనున్నాడు. ఈ సినిమా కోసం ఆయన తెలంగాణ యాస నేర్చుకోవడం విశేషం. ఈ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

- Advertisement -