బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా

428
Pooja-Hegde
- Advertisement -

తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతుంది హీరోయిన్ పూజా హెగ్డే. అల్లు అర్జున్ డిజె సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన పూజా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ, మహేశ్ బాబుతో మహర్షి, బన్నీతో అల..వైకుంఠపురంలో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూజా హెడ్గే ప్రస్తుతం అఖిల్ మోస్ట్ బ్యాచిలర్ మూవీతో పాటు ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తుంది. దీంతో పాటు బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది పూజా.

pooja

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించనుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’.. అక్షయ్‌ కుమార్‌తో ‘హౌస్‌ఫుల్‌-4’లో నటించింది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సంజీ తెరకెక్కిస్తున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 2021 ఈద్‌ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకోనుంది పూజా.

- Advertisement -