- Advertisement -
మెగా హీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన బుచ్చిబాబు సాన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈమూవీలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజాగా ఫస్ట్ వేవ్ అంటూ వీడియో విడుదల చేశారు. ఇందులో వైష్ణవ్ తేజ్ సముద్రం వైపు చేతులు చాపి బిగ్గరగా కేక వేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శ్యాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
- Advertisement -