నేడు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక

513
MINICIPAL
- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు చైర్మన్, మేయర్ ల ఎన్నిక నేడు జరుగనుంది. ఇవాళ నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మేయర్లు, చైర్ పర్సన్ల ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నిక ముగిశాకే డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్‌పర్సన్లను ఎన్నుకోవాలి.

ఈ ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్‌ఈసీ విడుదల చేసింది. కాగా మేయర్లు, చైర్ పర్సన్ల ఎన్నికపై ఆదివారం ఆయా పార్టీలకు విప్ జారీ చేశాయి. మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు గెజిటెడ్‌ హోదా గల అధికా రిని జిల్లా కలెక్టర్‌ నియమించారు. మధ్యాహ్నం 12.30 తర్వాత మేయర్లు, చైర్ పర్సన్లను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. కాగా 120మున్సిపాలిటిలకు గాను 111మున్సిపాలిటిల్లో టీఆర్ఎస్ అభ్యర్దులు విజయం సాధించారు. అంతేకాకుండా 9కార్పొరేషన్లకు గాను 9 టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.

- Advertisement -