కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

334
counting

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. కార్పొరేషన్ లో మొత్తం 60డివిజన్లు ఉండగా రెండు డివిజన్లలో ఎన్నిక ఏకగ్రీవం అయింది. మిగతా 58డివిజన్లకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం నాలుగు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగనుంది. కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం 58టేబుల్స్ ను ఏర్పాటు చేశారు.

ఇక 58మంది కౌంటింగ్ సూపర్ వైజర్లు, ఇద్దరు అసిస్టెంట్లు, 20మంది మైక్రో అబ్జర్ వర్ లు కౌంటింగ్ లో పాల్గోన్నారు. కౌంటింగ్ లో భాగంగా మొదటి డివిజన్లలో పొస్టల్ ఓట్లను లెక్కించనున్నారు. డివిజన్లవారిగా 25చొప్పున ఓట్లను కట్టలుగా కడతారు. ఒక్కో రౌండ్ కు వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించారు.