నితిన్ పెళ్లి..మరో అప్‌డేట్..!

582
nithin
- Advertisement -

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ నితిన్ పెళ్లికి సంబంధించిన వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 16న దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో నితిన్ వివాహం చేసుకోనుండగా 14,15 తేదీల‌లో ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అయితే నితిన్ చేసుకోబోయే అమ్మాయి పేరు షాలిని అని ఆమె లండ‌న్‌లో ఎంబీఏ చేసింద‌ని వీరికి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకారం తెలిపారట.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి పెళ్లికి కుటుంబసభ్యులతో పాటు కొంతమంది అతిధులు కేవలం 50 మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరికి సంబంధించిన వెడ్డింగ్ ప్రీపరేషన్స్‌ అంటే ఫ్లైట్ టికెట్స్ బుకింగ్,హోటల్ రూమ్స్‌కి సంబంధించి ప్రాసెస్ నడుస్తోందని టాక్.

2002లో జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన నితిన్ తర్వాత ఓ వైపు సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా మారాడు.

- Advertisement -