కొనసాగుతున్న కరీంనగర్ కార్పొరేషన్ పోలింగ్..

416
karimnagar corporation
- Advertisement -

కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం 348 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసిన అధికారులు ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు.

కరీంనగర్‌లోని మొత్తం 60 డివిజన్లలో 2 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 58 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.

58 డివిజన్లలో మొత్తం 371 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో 2,72,195 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 27న జరగనుంది.

- Advertisement -