‘నారప్ప’గా వెంకీ మామ..!

676
Hero Venkatesh
- Advertisement -

కోలీవుడ్ హీరోగా ధనుష్‌ ఇటీవలే ‘అసురన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తమిళంలో భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రీమేక్ అవుతుంది. దీనికి సంబంధించిన రీమేక్‌ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయనున్నారు.

Venky

ఈ చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ‘అనంతపురం’లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఈ సినిమాకి ‘నారప్ప’అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

- Advertisement -