మందు బాబులకు షాక్‌..!

396
Liquor

22వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైన్స్‌ షాపులు బంద్ కానున్నాయి. 21 మంగళవారం సాయంత్ర 5గంటల నుండి 22 బుధవారం సాయంత్రం 5గంటల వరకు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అదే విధంగా మునిసిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ సందర్భంగా ఈ నెల 25న కూడా మద్యం షాపులు బంద్‌ కానున్నాయి.

ఇక సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో దూసుకుపోయాయి. ప్రచారం గడువు ముగిసిన అనంతరం.. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు కానీ.. సభలు కానీ నిర్వహించొద్దని.. సభా సమావేశాలకు అనుమతి కూడా లేదని ఈసీ ప్రకటించింది. సోషల్ మీడియా, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, వాట్సాప్, మరే ఇతర సాంకేతిక సాధనాల ద్వారా కూడా ప్రచారం నిర్వహించొద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.