మేడారం మహా జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వాలన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్. వరంగల్ పశ్చిమ నియోజక వర్గ టీఆర్ఎస్ కార్యకర్తలు మేడారం జాతరకు బయలుదేరగా కార్యకర్తల బస్సులను జండా ఊపి ప్రారంభించారు వినయ్ భాస్కర్.
ఈ సందర్భంగా మాట్లాడిన వినయ్ భాస్కర్ …వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులమంత మేడారం వెళ్తున్నాం అన్నారు. సమ్మక్క సారాలమ్మ జాతరకు ప్రతి రెండేండ్ల కోసారి వెళ్లడం ఆనవాయితీ అని బీజేపీ కి తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలపై గౌరవం ఉంటే వెంటనే ప్రకటించాలన్నారు
మేడారం జాతరను ప్లాస్టిక్ రహిత జాతర గా మార్చేందుకు అందరం కృషి చేయాలన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలు ఫిబ్రవరి1 నుండి 5 వరకు 10వేల క్లాత్ సంచులను పంపిణి చేస్తారని..స్వచ్ఛంద సంస్థలు క్లాత్ సంచులను పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు నాగుర్ల వెంకన్న, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.