బన్నీపై వర్మ సంచలన వ్యాఖ్యలు..!

537
rgv
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం. ఈ యేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో వర్మ క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. మొన్నటి మొన్న ‘బ్యూటిఫుల్’ ప్రీ రిలీజ్ వేడుకల్లో డాన్సులు గట్రా చేసి తనలోని మరో కోణాన్ని బయటపెట్టాడు.

తాజాగా వర్మ మరో వివాదానికి తెరలేపారు. మెగా కుటుంబంలో పవర్ స్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమేనని వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి వర్మ తన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ పెట్టారు. అల్లు రామలింగయ్యకు నిజమైన వారసుడిని తానేనని అల్లు అర్జున్ నిరూపించుకున్నారని వర్మ అభిప్రాయపడ్డారు.

varma

ఇకపై అల్లు అర్జున్ మాత్రమే నిజమైన మెగా పవర్ స్టార్ అని.. ఓ సూపర్ స్టార్ గా, మెగా ఫ్యాన్స్ ను మెప్పించే హీరోగా నిలిచింది బన్నీ మాత్రమేనన్నారు. కాగా, చిరంజీవి అభిమానులు మెగా పవర్ స్టార్ అన్న ట్యాగ్ ను రామ్ చరణ్ కు ఇచ్చిన నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మెగా కుటుంబంపై వర్మ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

- Advertisement -