కోహ్లీ సూపర్ ఫ్యాన్‌ కన్నుమూత..

398
kohli
- Advertisement -

చారులత అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ కోహ్లీ సూపర్ ఫ్యాన్‌ చారులత(87) అంటే గుర్తుపట్టని వారుండరు. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చక్రాల కుర్చీలో కూర్చున్న చారులత కోహ్లీసేనను ప్రోత్సహించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లీ, రోహిత్‌ శర్మ ఆమెను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

అయితే విషాదాన్ని మిగిలిస్తూ ఆ బామ్మ మృతి చెందారు. చారులతకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌ ‘క్రికెట్‌ దాదీ’ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరి 13, సాయంత్రం 5:30 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు.

చారులత మృతిపట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. టీమిండియా సూపర్‌ ఫ్యాన్‌ చారులత పటేల్‌ ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచిపోతారు. ఆటపై ఆమెకున్న మమకారం మమ్మల్ని నిరంతరం ప్రేరేపిస్తుంది. ఆమె ఆత్మకు శాంతి కలుగుగాక అని ట్వీట్‌ చేసింది.

- Advertisement -