సినీ నటి సంజనపై కేసు నమోదు

426
Sanjana
- Advertisement -

సనీ నటి సంజనపై కేసు నమోదైంది. బెంగుళూరులోని మాజెస్టిక్ రోడ్డులో సంజన కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకుంది. ఆ వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. సంజనకు బెంగుళూరు పోలీసులు నోటిసులు పంపించారు. విచారణకు హాజరుకావాలని తెలిపారు.

మ‌హేష్‌ బాబుకు వీరాభిమాని అయిన సంజ‌న ఆదివారం సాయంత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాన్ని వీక్షించేందుకు వెళ్లింది.సినిమాకి వెళ్ళే స‌మ‌యంలో సంజ‌న కారు డ్రైవ్ చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అంతేకాదు దీనిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. సెల్ఫీ వీడియోపైనే పూర్తి దృష్టి పెట్టి డ్రైవింగ్ చేయ‌డంపై బెంగళూరు ట్రాఫిక్‌ పోలీస్‌లు సీరియస్‌ అయ్యారు.

ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రెటీలు ఇలాంటి పనులు చేస్తే ఎలా అంటూ వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంజన సర్థార్ గబ్బర్‌సింగ్‌, దండుపాళ్యం లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీగా ఉంది.

https://www.instagram.com/sanjjanaagalrani/?utm_source=ig_embed

- Advertisement -