‘డిస్కోరాజా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు

412
Disco Raja
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈమూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రాన్ని జనవరి 24న విడుదల చేయనన్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఈసందర్భంగా ఈనెల 19న ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లోని ఎన్ కన్వేన్షన్ సెంటర్ లో ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపనున్నారు.

disco-raja

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు. తమిళనట స్టార్ ఇమేజ్ వున్న బాబీసింహా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. రీసెంట్‌గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. తమన్ సంగీతం అందించిన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈమూవీలో భారీగా అంచనాలు పెట్టుకున్నారు రవితేజ అభిమానులు. ఈ మూవీ తర్వాత రవితేజ క్రాక్ అనే మూవీలో నటించనున్నాడు. బలుపు సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేని ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటించనుంది.

- Advertisement -