మొక్కలు నాటిన … ఎమ్మెల్యే నన్నపనేని

440
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వరంగల్ జిల్లా తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ ఆర్ ఈ సీ ఏరియా లోని తార గార్డెన్ లో 3 మొక్కలు నాటారు.

ఈసందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ అద్భుతమైన కార్యక్రమం చేపట్టారని , ఇంతకుముందు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పది వేల మొక్కలు నాటాను అని చెప్పారు. సంతోష్ కుమార్ లక్ష్యం పది కోట్ల మొక్కలు నాటే వరకు తన వంతుగా ఎక్కడ కార్యక్రమం జరిగిన మొక్కలు నాటుతానని తెలిపారు.

కేసీఆర్ హరితహారం దేశానికి ఆదర్శం అని , దీని వల్ల భవిష్యత్ తరాలకు చక్కటి ఆక్సిజన్ అందుతుంది అని ఈ సందర్భంగా సంతోష్‌ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ , వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ , వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ కి గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు నన్నపనేని నరేందర్.

green challenge

green challenge

- Advertisement -