అల వైకుంఠపురములో.. ఫస్ట్ డే కలెక్షన్స్

492
allu arjun
- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ప్రీమియర్ షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.

తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు సాధించడమే కాదు బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది అల వైకుంఠపురములో. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ ఎనలిస్టుల టాక్‌.

ఇక తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణలలో దాదాపు రూ. 20 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 2 కోట్లు, ఈస్ట్-వెస్ట్‌లలో కలిపి 4.5 కోట్లు, గుంటూరు 3 కోట్లు, క్రిష్ణా నెల్లూరు జిల్లాలలో దాదాపు 3 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ నిపుణుల అంచనా. ఓవర్సీస్‌లో 5 కోట్లు, కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో మూడున్నర కోట్లుపైగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా సంక్రాంతి రేసులో బొమ్మ హిట్టు అని అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.

- Advertisement -