ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. తన అందాలతో ప్రేక్షకులను మైమరపించింది. ఈసినిమాకు ముందు రెండు సినిమాల్లో నటించినప్పటికి పెద్దగా ఆసినిమాలు విజయం సాధించకపోవడంతో ఎక్కువగా గుర్తింపు రాలేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత అమ్మడు చాలా బిజీ అయిపోంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా నిధి అగర్వాల్ ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. ఈవిషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. రూ. 90 లక్షల విలువ చేసే పోర్స్చే మకాన్ కారు కొన్నట్టు తెలిపింది. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దంలో అందంగా వెల్‌కమ్ చెబుతున్నానంటూ పోస్ట్ పెట్టింది.
ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం ఓ కొత్త హీరోతో సినిమా చేస్తుంది. మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ నటిస్తున్న తాజా చిత్రంలో కథానాయికగా నటిస్తుంది నిధి అగర్వాల్. దేవదాస్ మూవీ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మావతి గల్లా చిత్రాన్ని నిర్మించగా.. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈమూవీలో నిధి అగర్వాల్ కు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఈసినిమాకు ఏకంగా రూ1కోటి తీసుకుందట నిధి అగర్వాల్. ఏది ఏమైనా ఒకే ఒక్క సినిమాతో లైఫ్ స్టైల్ మారిపోయిందని అంటున్నారు నెటిజన్లు.