నెటిజన్‌కి షాక్‌ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్..!

442
rahul sipligunz
- Advertisement -

బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు ఏం చేసిన వార్తల్లో సంచనలంగా మారుతోంది. బిగ్ బాస్‌ విన్నర్‌గా నిలిచిన తర్వాత కెరీర్‌లో బిజీగా మారిన రాహుల్ ఓ వైపు సినిమాల్లో పాటలు…మరోవైపు లైవ్ కన్‌సర్ట్‌లతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు.

ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులతో కలిసి బెంజ్ కారు కొన్నాడు..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అంతా శుభాకాంక్షలు చెప్పారు. అయితే కొంతమంది మాత్రం ఫస్ట్ ఇళ్లు కొంటానని ఇప్పుడు ఖరీదైన కారు కొన్నావ్..నీ సరదాలను తీర్చుకుంటున్నావా అంటూ చురకలు అంటించారు.

ఈ విమర్శలకు తనదైన శైలీలో స్పందించారు రాహుల్. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి.. నేను ముందే ఫ్లాట్ కొన్నా.. అది రెడీ కావడానికి 7 నెలలు టైం పడుతుంది. టేస్ట్ ద థండర్… జస్ట్ చిల్ అంటూ తన బెంజ్ కారు ముందు కూల్‌గా థమ్స్ అప్ తాగుతూ.. తనను ట్రోల్ చేసేవారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు రాహుల్.

ఇక ప్రస్తుతం రాహుల్ క్రియేటివ్ దర్శకుడు క్రిష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నాడు.

- Advertisement -