- Advertisement -
సంక్రాంతి సెలవులను ప్రకటించాయి తెలంగాణ,ఏపీ ప్రభుత్వాలు. తెలంగాణలో జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించగా జనవరి 17న తిరిగి విద్యాసంస్థలు తెరచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించనున్నాయి.
ఇక ఏపీలో జనవరి 10 నుంచి 20 వరకు పది రోజుల పాటు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. జనవరి 21న స్కూల్స్ తెరచుకోనున్నాయి. సంక్రాంతికి ఏపీలో కోడి పందాలు ఫేమస్ కావడంతో ఇప్పటికే తమ సోంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్సులు,టైన్స్లో రిజర్వేషన్స్ కూడా చేసుకున్నారు.
ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా విద్యార్ధులకు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది.
- Advertisement -