స్మగ్లర్ గా అల్లు అర్జున్

604
Allu Arjun
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత అల..వైకుంఠపురంలో సినిమా చేశాడు. ఇటివలే షూటింగ్ పూర్తైన ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ గా నటించింది. గీతా ఆర్ట్స్,, హారిక అండ్ హాసిని బ్యానర్ పై అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈమూవీ ట్రైలర్ కు అద్భతమైన స్పందన వస్తోంది. ఈసినిమా తర్వాత బన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు.

Allu Arjun sukumar

ప్రస్తుతం ఈమూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ జరుగనుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కాగా ఈమూవీలో అల్లు అర్జున్ కొత్త గెటప్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇందుకోసమే బన్ని గడ్డం పెంచుతున్నట్లు సమాచారం. ఆయన పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయనీ, కొంతసేపు స్మగ్లర్ గాను కనిపిస్తాడని అంటున్నారు. ఇక బన్ని కి జోడిగా రష్మిక మందనను తీసుకున్నారు. బన్ని సుకుమార్ కాంబినేషన్ లో గతంలో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

- Advertisement -