నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది

483
minister ktr
- Advertisement -

విద్యార్దులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇంజనీరింగ్‌ విద్యలో వస్తున్న మార్పులపై మేడ్చల్‌లోని అనురాగ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. కాగా, సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో మంత్రులు కేటీఆర్‌, సబితా రెడ్డితో పాటు, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, 150 దేశాల ఇంజనీరింగ్‌ విద్య నిపుణులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. మంచి ఇన్‌స్టిట్యూట్‌ అంటే పెద్ద పెద్ద భవనాలు ఉండడం కాదనీ.. కళాశాలలో అత్యున్నతమైన ప్రొఫెసర్లు ఉండడమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. విద్యార్థుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం టాస్క్‌ను ఏర్పాటు తెలిపారు. టాస్క్‌తో కలిసి పనిచేసేందుకు ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ ముందుకు రావాలని మంత్రి సూచించారు .టీఎస్‌ ఐపాస్‌ ద్వారా అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి ఉద్యోగావకాశాలు మెరుగు పరుస్తున్నామని అన్నారు.

- Advertisement -