ఎంత మంచివాడవురా…సెన్సార్ పూర్తి

549
entha manchivadavuraa
- Advertisement -

నందమూరి కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా భారీగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

శతమానం భవతి చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని పాటలను డిసెంబరులో విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమా బాగుందని..మంచి ఫ్యామిలీ ఫ్రెండ్లీ స్టోరీ అని ప్రశంసలు గుప్పించారు.

పాటలకు ఎంతో ప్రాధాన్యముండేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకల్పన చేశారు. న‌టీన‌టులు:నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు.

- Advertisement -