- Advertisement -
పెట్రోల్,డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్, అమెరికాల మధ్య యుద్ద వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొద్దిరోజులుగా పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూపోతున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా నాలుగో రోజున ధరలు పెంచుతూ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ పెట్రోల్ పై 9 పైసలు, డీజిల్ పై 11 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఐఓసీ ప్రకటించింది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ. 80.12కు, డీజిల్ ధర రూ. 74.70కి పెరిగింది. ఇక దేశ రాజధాని న్యూడిల్లీలో పెట్రోలు ధర రూ. 75.54కు, డీజిల్ ధర రూ. 68.51కి చేరింది. గడచిన ఏడాది వ్యవధిలో పెట్రోల్ ధర రూ. 80ని దాటడం ఇదే తొలిసారి. పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
- Advertisement -