లక్ష్మణ్ రావు గౌడ్‌ను సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్..

481
minister srinivas goud
- Advertisement -

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ శనివారం జలవిహార్‌లో నిర్వహించిన ఆత్మీయ సన్మాన సభను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర గౌడ సంఘం మరియు గౌడ హాస్టల్ అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు నాచగోని రాజయ్య గౌడ్, మొగుళ్ల అశోక్ గౌడ్ లు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గీత వృత్తిదారుల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టినందుకు, గౌడ్ ల ఆత్మగౌరవ భవనానికి 5 ఎకరాల భూమిని,భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలను కేటాయింపు కోసం కృషి చేసిన రాష్ట్ర మంత్రులు కేటీ రామారావు, వీ. శ్రీనివాస్ గౌడ్ లకు గౌడ జాతి పక్షాన ఆత్మీయ సన్మానంను 04.01.2020 (శనివారం) తెలంగాణ గౌడ సంఘము, గౌడ హాస్టల్ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

- Advertisement -