హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సఖీ సెంటర్లు, స్వధార్ గృహ, ఉజ్వల,ఎంఎస్కే పథకాలపై రాష్ట్రస్థాయి సదస్సు, జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్ హాజరైయ్యారు. ఈ సదస్సులో మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. తెలంగాణలో సఖి సెంటర్లు అద్భుతంగా పని చేస్తున్నయి. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 32 జిల్లాల్లో సఖి సెంటర్లు పూర్తయ్యాయి. త్వరలోనే ములుగు జిల్లాలో సఖి సెంటర్ ప్రారంభిస్తం. గ్రామస్థాయిలో సఖి సెంటర్లపై మరింత అవగాహన కల్పించాలి. అలాగే శిశు సంక్షేమ శాఖ సంబంధిత కేంద్ర మంత్రిని కలిసి..హైదరాబాద్‌లో మరొక కేంద్రం, మరికొన్ని సఖి సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
బాలికల పరిరక్షణ కోసం 18 ఏళ్లలోపు వారి కోసం.. అల్వాల్‌లో ప్రొటెక్షన్ హోమ్‌ను ప్రారంభిస్తం. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం కోసం త్వరలోనే సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖకు లేఖ రాస్తాం. మహిళల రక్షణ కోసం హెల్త్, పోలీస్, న్యాయశాఖ అధికారులతో సంయుక్తంగా సమావేశం నిర్వహిస్తాం. తెలంగాణ సఖి సెంటర్లు దేశంలోనే తలమానీకంగా పని చేసేలా కృషి చేస్తున్నం. రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేలా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టారు అని మంత్రి తెలిపారు.
పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నం.ఆడ పిల్లల రక్షణ కోసం షీటీమ్‌లు పని చేస్తున్నాయి. షీటీమ్లపై అనేక రాష్ట్రాలు అధ్యయనం చేశాయి. ఆడపిల్లలపై జరిగే దాడులు, గృహ హింసను అరికట్టేందుకు మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. సఖి సెంటర్లు ఎదుర్కొంటున్న చిన్నచిన్న సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సత్యవతి అన్నారు.