త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జోరు తగ్గదన్నారు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని దమ్మాయిగూడలో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు.
ఈసందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. రాష్ట్ర అభివృద్దికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రజలను పట్టించుకోలేదు. రాష్ట్రంలో భారీగా పెన్షన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని మంత్రి అభిప్రాయపడ్డారు. మిషన భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి అన్నారు.ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారన్నారు.