దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న బిగ్ బి

428
amitab
- Advertisement -

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అందుకున్నారు. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ బిగ్‌బీకి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అమితాబ్ ను కోవింద్ అభినందించారు. భారతీయ సినిమా రంగానికి విశిష్టసేవలు అందించినందుకు గానూ.. బిగ్‌బీకి ఈ పురస్కారం లభించింది.

ఈసందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.. అవార్డు అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు అవార్డు అందజేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ధన్యవాదాలు తెలిపారు. దాదా సాహెబ్‌ ఫాల్కె అవార్డు ఇవ్వడం ప్రారంభించి 50 సంవత్సరాలు అవుతుంది. నాకు కూడా గత 50 సంవత్సరాలుగా ఈ సినిమా ప్రపంచంలో పనిచేసే భాగ్యం లభించింది అన్నారు. కాగా.. ఈనెల 23వ తేదీన జాతీయ అవార్డులు అందుకున్న వారందరికీ రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు.

- Advertisement -