తెలంగాణ సంప్రదాయలకు ప్రతీక- సిపి

446
- Advertisement -

నుమయిష్ ఎగ్జిబిషన్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ,సంప్రదాయలకు ప్రతీక. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు లభించే వస్తువులు ఇక్కడ దొరుకుతాయి సిపి అంజనీ కుమార్ తెలిపారు. జనవరి 1న 2020 హైద్రబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమయిష్ ఎగ్జిబిషన్ ఏర్పాట్లను ఈ రోజు సిపి అంజనీ కుమార్‌ పరిశీలించారు.. ఈ ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

pc

ఈ సందర్భంగా సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన అగ్నిప్రమాదం ఘటన వల్ల ఎగ్జిబిషన్ సొసైటీ నూతన కమిటీ పలు జాగ్రత్తలు తీసుకుంది. ప్రమాదాలను నివారించేందుకు ప్రతి 30 మీటర్లకు ఫైర్ హైడ్రాన్ట్స్ , ఫైర్ కంట్రోల్ వెహికిల్స్ తిరిగేందుకు రోడ్ల నిర్మాణం, 1 లక్ష 50 వేల లీటర్ల నీటి నిలువ ఉండే రెండు వాటర్ సంపులను, 9 ఎమర్జెన్సీ ఏక్సిట్ మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ నెల 25 నుండి గ్రౌండ్స్ లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచాము. అని సిపి పేర్కొన్నారు.

pc anjan kumar

- Advertisement -