ఐపీఎల్ 2020 వేలానికి రంగం సిద్ధమైంది. ఈనెల 19 నుంచి ఐపీఎల్ వేలం ప్రారంభంకానుండగా అందుబాటులో 332 మంది క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఇక మూడు సార్లు ఐపీఎల్ విన్నర్‌గా నిలిచిన చెన్నై ఈ సారి టైటిల్ వేటలో ముందంజలో ఉంది.
ఇప్పటికే వేలం కంటే ముందే ఆరుగురు ఆటగాళ్లు సామ్ బిల్లింగ్స్,చైతన్య బిష్నోయ్,దృవ్ షోరే,డేవిడ్ విల్లే,మొహిత్ శర్మలను వదులుకుంది. వీరంత గత సీజన్‌లో పేలవ ఫామ్‌తో నిరాశపర్చారు.
ఇక ప్రస్తుత వేలంలో సీఎస్‌కే ఐదుగురిని వేలంలో దక్కించుకోనుండగా ఇందులో ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్‌ని తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఆటగాళ్లే టార్గెట్‌గా వేలంలో దిగనుంది చెన్నై.
ఇంగ్లాండ్ ఆటగాళ్లు టామ్ బాంటన్,సామ్ కుర్రాన్‌లతో పాటు లోకల్ ఆటగాడు షారుఖ్ ఖాన్‌లపై దృష్టిసారించింది. టామ్ బాంటన్ 13 మ్యాచ్‌ల్లో 42.23 యావరేజ్‌తో 549 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉండగా నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అద్బుత ప్రదర్శన కనబరుస్తుండటంతో అతన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. ఇక తమిళనాడుకు చెందిన షారుఖ్ ఖాన్ మంచి ఫామ్‌లో ఉండటంతో అతన్ని జట్టులో చేర్చుకోవాలని భావిస్తోంది చెన్నై.
సీఎస్‌కే జట్టు: ధోని,సురేష్ రైనా,డుప్లెసిస్,అంబటి రాయుడు,మురళి విజయ్,రుతురాజ్ గైక్వాడ్,షేన్ వాట్సాన్,డ్వైన్ బ్రేవో,కేదార్ జాదవ్,ఎంగిడి,రవీంద్ర జడేజా,సాంటర్,మోను కుమార్,హర్భజన్ సింగ్,కరన్ శర్మ,ఇమ్రాన్ తాహీర్,దీపక్ చాహర్,కేఎం ఆసీఫ్