ఉప్పల్ భగాయత్ భూములపై హెచ్‌ఎండీఏ భారీ ఆశలు..

1071
uppal
- Advertisement -

హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ భూముల అమ్మకం పై హెచ్ఎండీఏ భారీగా ఆశలు పెట్టుకుంది. గతం కంటే ఎక్కువ ధర నిర్ణయించి ఈ- వేలానికి సిద్దమయింది. ఒక లక్షా 65 వేల 524 చదరపు గజాల స్థలాన్ని ఆన్ లైన్ లో అమ్మకానికి బిడ్ నిర్వహించనుంది. రెండో దశలో మొత్తం 124 ప్లాట్ల ను ఈ-వేలం వేసింది. అన్ని అనుమతులు ఉన్న ఈ ప్లాట్లకు బ్యాంకు లోన్లు కూడా వస్తాయని నగర ప్రజలు వినియోగించుకోవాలని హెచ్ఎండీఏ కోరుతోంది.

హైదరాబాద్ మెట్రో అభివృద్ధి అథారిటీ ప్రతిష్టాత్మకంగా అభివృధ్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లే అవుట్ లోని ప్లాట్లను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు సిద్దం చేశారు. అథారిటీ ప‌రిధిలో మొత్తం 124 ప్లాట్లను విక్రయించేందుకు హెచ్ఎండీఏ నిర్ణయించింది. అన్ని ప్లాట్లలో కలిపి 1 లక్షా 65 వేల 524 చదరపు గజాల స్థలాన్ని అమ్మకానికి పెట్టారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు వాణిజ్య, నివాస, మల్టీపర్పస్ జోన్ లో ఉండే ప్లాట్లను అమ్మకానికి పెట్టారు. మొత్తం స్థలంలో 46 వేల 780 గజాల స్థలం వాణిజ్యం కోసం వినియోగించుకోనేందుకు విక్రయిస్తున్నారు.

ఇక నివాస యోగ్యం అయిన ప్లాట్లలకు గజానికి 30 వేల రూపాయలుగా, వాణిజ్య ప్లాట్లకు గజానికి 40 వేలుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది. గత వేలం కంటే ఈసారి చదరపు గజానికి రెండు వేల రూపాయలు అధికంగా నిర్ణయించారు అధికారులు. ఇక ఈసారి వేస్తున్న వేలంలో అత్యధికంగా 100 నివాస ప్లాట్లు ఉన్నాయి. 9 వాణిజ్య ప్లాట్లు, 15 మల్టీ యూజ్ జోన్ కు చెందిన ప్లాట్లు ఉన్నాయి. ఇక 165 గజాల నుంచి 18 వేల చదరపు గజాల వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ- వేలంలో పాల్గొనే వారు ముందుగా వెయ్యి రూపాయ‌లు, 18 శాతం జీఎస్టీ చెల్లించి తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మూడు వందల గజాల లోపు ప్లాట్లు కోనుగోలు చేసేవారు ఐదు లక్షల రూపాయలు, మూడు వందల నుంచి ఐదు వందల గజాల లోపు ప్లాట్లు కోనుగోలు చేసేవారు 8 లక్షలు, 500 నుంచి వెయ్యి గజాల వరకు లక్షలు,వెయ్యి గజాల నుంచి రెండు వేల గజాల వరకు 25 లక్షలు, రెండు వేల గజాలకు పైగా ఉన్న ప్లాట్లు కోనే వారు 50 లక్షల రూపాయలు ఈఎండీ చెల్లించాల్సి ఉంటుంది. వేలంలో ప్లాట్లు దక్కకుంటే మూడు పని దినాల్లో ఈ డబ్బులు హెచ్ఎండీఏ తిరిగి చెల్లిస్తుంది. పాల్గోనే వారు డిసెంబర్ 11 తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. డిసెంబర్ 13వ తేది వరకు ఈఎండి చెల్లించాలి. ఇక 14, 15, 16 తేదిల్లో ఇ-వేలం ఉంటుంది. పాదర్శకంగా అమ్మకాలు నిర్వహించేందు ఈ ఇ-వేలం కార్యక్రమాన్ని నిర్వహస్తున్నామని హెచ్ఎండీ అధికారులు తెలిపారు.

ఈ-వేలంలో పాల్గొనే బిడ్డరు వేలంలో పాల్గొనేటప్పుడు కనీసం 100 రూపాయ‌ల కంటే ఎక్కువగా కోట్ చేయాల్సి ఉంటుంది. అత్యధిక ధర కోట్ చేసిన వారికి ఈ-వేలం ప్రక్రియ ముగిసిన వెంటనే హెచ్ఎండీఏ సమాచారం పంపిస్తుంది. వేలం ప్రారంభమయిన తరువాత వేలంలో పాల్గోన్న వారు ఒకరు బిడ్ వేసిన 8 నిముషాలోపు ఎక్కువ ధరను కోట్ చేయ్యాల్సి ఉంటుంది. 8 నిముషాల సమయం దాటితే బిడ్ క్లోజ్ అయినట్లుగా ప్రకటిస్తారు. అత్యధిక ధర తో వేలంలో ప్లాటును దక్కించుకున్నవారు వారం రోజుల్లోపు 25 శాతం ధరను చెల్లించాలి. అయితే వాయిదాల పద్దతిలో వడ్డితో చెల్లించే వేసులుబాటు హెచ్ఎండీఏ కల్పించింది. అన్ని అనుమతులు ఉండటంతో బ్యాంకర్లు కూడా లోన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇక అన్ని సౌకర్యాలు ఉన్న హెచ్ఎండిఏ లే అవుట్ లో ప్లాట్లు కోన్న వారికి తామే నిర్మాణ అనుమతులు ఇస్తామంటున్నారు అధికారులు. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

గ‌తంలో హెచ్ఎండీఏ నిర్వహించిన ఈ వేలంలో 500 కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావిస్తే…650 కోట్ల వరకు అదాయం వచ్చింది ఈ సారి కూడా భారీగా ఆదాయం వస్తుందని హెచ్ఎండీఏ భావిస్తోంది.

- Advertisement -