జయప్రదతో చిరు డ్యాన్స్‌…అదిరిపోయింది

724
chiru dance
- Advertisement -

1980ల నాటి సినీ తారలకు ఇటీవలె మెగాస్టార్ చిరంజీవి విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరు ఇంట్లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ నటులు ఒక చోట కలిసి సందడి చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బంగారు కోడిపెట్ట పాటకు స్టెప్పులేసి ఇరగదీశాడు చిరు. ఇందులో విశేషమెంటంటే చిరుతో పాటు కుష్బు, జయప్రద కూడా డ్యాన్స్‌ చేసి అందరి చేత విజిల్స్ వేయించారు.

ఈ ఆత్మీయ కలయికలో వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, రాధిక, శరత్ కుమార్, ప్రభు, రెహమాన్, భానుచందర్, నరేష్‌, సురేష్‌, జయసుధ, నదియా, రమ్యకృష్ణ, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ, భాగ్యరాజ్‌, జాకీ ష్రాఫ్‌, జగపతిబాబు తదితరులు పాల్గొన్నారు.

Mega Star Chiranjeevi Mind Blowing Dance With Khushbu and Jayaprada @ 80’s Reunion Event#Chiranjeevi #khushboo #jayaprada

- Advertisement -