గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన కరీంనగర్ సీపీ

430
cp Karimnagar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఊరూరా ఉద్యమంలా సాగుతుంది. ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ లో అన్నివర్గాల వారు భాగస్వాములవుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు విసిరిన సవాల్ స్వీకరించి కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి పోలీస్ హెడ్ క్వార్టర్ లో మొక్కలు నాటారు. అనంతరం నాటిన చెట్లతో సెల్ఫీ దిగారు. తాను తన సిబ్బందితో కలిసి మొక్కలు నాటడమే కాకుండా కాదు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ శ్యామ్ ప్రసాద్ లాల్, డీఆర్వో ప్రావీణ్యలను నామినెట్ చేశారు.

cp

వీరంతా తమవంతుగా చెట్లు నాటడమే కాకుండా ఒక్కొక్కరు మరో ముగ్గురిని గ్రీన్ ఛాలెంజ్ కు నామినేట్ చేయాలని సూచించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కాన్సెప్ట్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పాడుతుందని సీపీ కమలాసన్ రెడ్డి అన్నారు. తమవంతు సామాజిక బాధ్యతగా ఇప్పటికే పోలీసులు కరీంనగర్ లో మియావాకీ పద్దతిలో చెట్లు నాటి వాటిని రక్షిస్తున్నామని సీపీ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -