తెలంగాణలో పెట్టుబడులకు స్వాగతం- మంత్రి

689
srinivas goud
- Advertisement -

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనువైందని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన మీట్ అండ్‌ గ్రీట్‌లో గురువారం మంత్రి మాట్లాడారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించే వారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ ఐటీ పార్కు., మల్టీ పర్పస్‌ పార్కులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

minister srinivas goud

తెలంగాణలో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రవాసులు స్వరాష్ట్రంలో పరిశ్రమలు స్థాపిస్తే.. స్థానికులకు ఉపాధి అవకాశాలు ఉంటాయని శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో TCSS అధ్యక్షుడు నీలం మహేందర్, ఉపాధ్యక్షుడు గడప రమేష్, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, గుత్తికొండ కరుణాకర్ రావు, గింజల సురేందర్ రెడ్డి, జూలూరి సంతోష్, దిలీప్, పట్టూరి కిరణ్ మరియు ఇతర ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -