ఇస్మార్ట్ భామలతో వరుణ్ రొమాన్స్..!

340
varun tej
- Advertisement -

గద్దలకొండ గణేష్ హిట్ తర్వాత కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా వరుణ్ 10వ సినిమా ఇది. ఈ మూవీలో వరుణ్ బాక్సర్‌గా కనిపించనుండగా మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్ సమర్పణలో టీ సిదు,అల్లు వెంకటేష్ నిర్మిస్తున్నారు.

తాజాగా సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. వరుణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని..ఇందుకోసం నభా నటేష్, నిధి అగర్వాల్‌ని ఎంపిక చేశారని టాక్ నడుస్తోంది.

అయితే ఇవన్నీ రూమర్లేనని త్వరలోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తామని నిర్మాతలు చెబుతున్నారు. మొత్తంగా సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకాకముందే వరుణ్ తేజ్‌ మూవీపై రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

- Advertisement -