పవర్‌ స్టార్‌ను ఇమిటేట్‌ చేసిన మెగాస్టార్‌..!

551
- Advertisement -

యువ హీరో నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ నవంబర్ 29 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఈమధ్యే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మెగా సపోర్ట్‌తో బజ్ పెంచేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

చిన్న సినిమా అయినా పెద్ద మనసుతో వేడుకకు హాజరయిన మెగాస్టార్‌ చిరంజీవి కార్యక్రమం ఆద్యంతం సరదాగా గడిపారు. తన ప్రసంగంలోనూ అదే జోష్ చూపించారు. నిఖిల్ రూపంలో నాకు మరో తమ్మడు, శిష్యుడు దొరికాడన్నారు చిరంజీవి. అయితే ఈ కార్యక్రమంలో చిరు ఫాన్స్‌కి ఉహించని షాక్‌ ఇచ్చారు.

megastar

మెగాస్టార్ చిరు, పవర్ స్టార్ సిగ్నేచర్ స్టిల్‌ని స్టేజ్‌పై అందరి ముందే ఇమిటేట్ చేశారు. మెడపై చెయ్యిపెట్టి..పవర్‌పుల్ కళ్లతో కోపంగా చూసే సీన్..పవన్ కళ్యాణ్ చాలా సినిమాల్లో ఉంటుంది. ఈ మూమెంట్ థియేటర్లో కనిపిస్తే..ఆ రచ్చ మాములుగా ఉండదు.

ఆ కాసేపు ఫ్యాన్స్‌ను అదుపుచెయ్యడం అసాధ్యం. ఆ స్టిల్‌ను మంగళవారం జరిగిన ఈవెంట్‌లో చిరంజీవి చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ భావోద్వేగానికి గురయ్యారు. అర్జున్ సురవరం సినిమాలో చేగువేరాకు సంబంధించిన సాంగ్ ఉంటుంది. అది వింటున్నంతసేపు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గుర్తకు వచ్చారన్న మెగాస్టార్..అతని సిగ్నేచర్‌ మూమెంట్‌ స్టిల్ ఇచ్చి మెస్మరైజ్ చేశారు.

MegaStar Chiranjeevi speech At Arjun Suravaram Pre Release Event..Nikhil Siddharth and Lavanya Tripathi Starrer Arjun Suravaram Movie..

- Advertisement -