మద్దతుధర విషయంలో రైతుకు అన్యాయం జరగొద్దు

417
Minister Niranjan Reddy
- Advertisement -

మద్దతు ధర విషయంలో పత్తి రైతులకు అన్యాయం జరగొద్దన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ వాసవి కాటన్ ఇండస్ట్రీ, ఈశ్వర కాటన్ ఇండస్ట్రీ, శ్రీ బాలాజీ కాటన్ ఇండస్ట్రీలలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను అకస్మిక తనిఖీ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్ధ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి పలువురు అధికారులు పాల్గోన్నారు.

తేమ యంత్రాలు లేకుండా కొనుగోళ్లు చేస్తుండంతో నిర్వాహకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి. ఈరోజు పత్తి అమ్మిన ప్రతి రైతుకు పూర్తి మద్దతు ధర ఇవ్వాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల సిబ్బందిని కొనుగోలు చేస్తున్న విధానంపై మంత్రి అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -