వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మహబాబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటడులో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎర్రబెల్లి.
రైతు సంక్షేమం విషయంలో గత ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి తేడా చూడాలని ప్రజలను కోరారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని సీఎం కేసీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారని…24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ఇస్తున్నారు. పెట్టుబడి కోసం ప్రతి ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నారని వెల్లడించారు.
పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏటా రూ.13 వేల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. ప్రమాదవశాత్తు ఎవరైనా రైతులు మరణిస్తే రైతు బీమాతో ఆసరాగా ఉంటున్నారని….రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందన్నారు.
పత్తిని కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీసీఐ మాత్రం పట్టించుకోవడం లేదని…రైతు సంక్షేమం విషయంలో రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తేడా చూడాలన్నారు. అందరి సహకారం, సమష్టి కృషితో స్వచ్ఛ సర్వేక్షన్ లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు వచ్చిందన్నారు.
Errabelli Dayakar Rao is a Member of the Legislative Assembly and a cabinet Minister in the Indian state of Telangana and a former member of the Parliamen