ఇందిరా గాంధీకి ఘన నివాళి..

726
sonia gandhi
- Advertisement -

మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జ‌యంతి సందర్భంగా ఢిల్లీలోని శ‌క్తిస్థ‌ల్ వ‌ద్ద కాంగ్రెస్ నేత‌లు ఇందిర‌మ్మకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ , మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీలు ఇందిరా స‌మాధి వ‌ద్ద అంజలి ఘటించారు. ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మోడీ….ఇందిరా గాంధీ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.

దేశ తొలి మ‌హిళా ప్ర‌ధానిగా సేవలందించారు ఇందిరా గాంధీ. ఎన్నో సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలిచి ఉక్కు మహిళగా పేరుపొందారు. 1917, నవంబర్ 19న జన్మించారు. జవహర్ లాల్ నెహ్రూ ఏకైక సంతానం. నెహ్రూ వారసురాలిగా 1938 లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేశారు.

1942లో జర్నలిస్ట్ ఫిరోజ్‌ను పెళ్లి చేసుకున్నారు ఇందిరా గాంధీ. భర్తతో విభేదాలు రావడంతో ఆమె తండ్రి దగ్గరకు చేరారు. 1951లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నెహ్రూకు పోటీగా ఫిరోజ్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగారు. అప్పుడు ఇందిరా గాంధీ తండ్రి తరఫున ప్రచారం చేయగా.. నెహ్రూ ఘన విజయం సాధించారు. ఇందిరా గాంధీ 1959లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

1966 జనవరి 24న ఇందిర మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించారు. తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977లో సంచలన నిర్ణయంతో ఎమర్జెన్సీని ఉపసంహరించి ఎన్నికలకు వెళ్లారు.. కానీ ఆ ఎన్నికలలో ఓటమి తప్పలేదు. తర్వాత 1978లో ఇందిరా కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసి ఉప ఎన్నికలలో విజయం సాధించారు. తర్వాత 1980 మధ్యంతర ఎన్నికలలో ఘన విజయం సాధించి మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1984 అక్టోబర్ 31న ఆమెను తన సొంత భద్రతా సిబ్బంది కాల్చి చంపడం సంచలనం రేపింది.

Former Prime Minister Dr Manmohan Singh and Congress interim president Sonia Gandhi pay tributes to former Prime Minister #IndiraGandhi on her 102nd birth anniversary

- Advertisement -