()పవిత్ర శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఇవాళ సాయంత్రం తెరుచుకోనున్నాయి. భక్తులకు రేపటి నుంచి అనుమతి కల్పించనున్నారు. అయ్యప్పస్వామి గుడిలోకి మహిళల ప్రవేశంపై తీర్పును సుప్రీం కోర్టు విస్తృత ధర్మసనానికి బదిలీచేసిన నేపథ్యంలో శబరిమలలో 10వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
()శ్రీలంక అధ్యక్ష పదవికి శనివారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. అయితే మైనార్టీ ముస్లిం ఓటర్లను తరలిస్తున్న బస్సులను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని అగంతకుడు కాల్పులు జరపగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
()క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ చివరకు రాష్ట్రపతి పాలన వరకు దారితీసిన మహారాష్ట్ర సంక్షోభం క్లైమాక్స్ చేరింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య డీల్ కుదిరింది. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌కి పార్టీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. మొత్తానికి ఇవాళ మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
()ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎవరెవరిని కలుస్తారో అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిన్నే హస్తినకు చేరుకున్న జనసేనాని.. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ నేతలను కలవనున్నట్టు ప్రచారం మాత్రం జరుగుతోంది.
()మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్న ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. నాలుగు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన ధోనీ.. వెస్టిండిస్ సిరీస్‌కి ఎంపికయ్యే ఛాన్స్ ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.
()ఆగస్టు సంక్షోభాలను ఎదుర్కొని నిలచున్న టీడీపీకి తాజాగా నవంబర్ సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పాగా కృష్ణజిల్లాకు చెందిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబు,లోకేష్‌లపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రస్తుతం కృష్ణా జిల్లాలో వంశీ వర్సెస్ టీడీపీగా మారాయి రాజకీయాలు.