సరిలేరు నీకెవ్వరు…టీజర్ లోడింగ్

423
sarileru neekevvaru

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఇప్పటికే విడుదలైన మూవీ స్టిల్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీకి సంబంధించి మరో అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి.

సరిలేరు నీకెవ్వరు టీజర్ లోడ్ అవుతుందని …అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందులో మహేష్ గన్‌తో షూట్‌ చేస్తున్న వీడియోని షేర్ చేశారు.

చాలాకాలం తర్వాత విజ‌య‌శాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌గా మహేష్ సరసన ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా ఐటెం సాంగ్‌లో మెరవనుంది.

sarileru neekevvaru teaser is loading
Superstar Mahesh Babu’s ‘Sarlieru Neekevvaru’ is all set to release its full-length teaser. The teaser is loading. It will be unveiled next week.