టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్..రాములో రాములా

434
ramulo ramula

అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ అల..వైకుంఠపురంలో. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోండగా విడుదలకు ముందే సెన్సేషన్‌కి కేరాఫ్‌గా మారింది.

దీపావళి కానుకగా సినిమా నుంచి విడుదలైన రాములో రాములా సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మాంచి మాస్ బీట్‌తో వచ్చిన ఈ సాంగ్.. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కిన పాటగా నిలిచింది.

తాజాగా విడుదలై నెలరోజులు గడుస్తున్న రాములా సాంగ్ సునామీ ఆగలేదు. టాలీవుడ్‌లో అతి తక్కువ రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న తొలిసాంగ్‌గా నిలిచింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు.